రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో మంగళవారం ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఇందులో 48 ఆవులు, గేదె దూడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, పశువుల పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.
