డిచ్ పల్లి, బతుకమ్మ: మండల కేంద్రంలో కొమురం భీమ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయక్ పోడ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వాసరి సాయినాథ్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఆదివాసులు చదువు అనే ఆయుధంతో ముందుకు వెళ్లాలని, అప్పుడే ఏదైనా సాధించొచ్చన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ మండల అధ్యక్షుడు శేఖర్, నాయకులు మోహన్, శ్రీనివాస్, సాయిలు, కిషన్, బాలయ్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
