ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలి

0 9,006

 

. . . ఎంపీడీఓ సంతోష్ కుమార్

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

భూగర్భ జలాలు అడగంటుంతున్న నేపథ్యంలో ప్రతినీటి బొట్టును ఒడిసికట్టి సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడీఓ సంతోష్ కుమార్ అన్నారు. విబిజీ రామ్ జి పథకం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని బడా భీమ్ గల్, పెద్దమ్మకాడి తాండా, సికింద్రాపూర్ గ్రామాల్లో చేపడుతున్న నీటి నిల్వల పనులను పరిశీలించారు. ఈ మేరకు బడా భీమ్ గల్ హైస్కూల్ లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలకు భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఎంపిడీఓ మాట్లాడుతూ ఎలినో ప్రభావము కారణంగా వర్షాలు తగ్గే అవకాశం ఉండటం మూలంన ప్రతి నీటి బొట్టు ను భూమిలో ఇంకించే విధంగా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి నీటి సంరక్షణ పనులను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల సర్పంచులు. బడా భీమ్ గల్ వి డి సి సభ్యులు, ఏపీవో జీ నర్సయ్య,సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.