బాన్సువాడ, బతుకమ్మ :
రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు బాన్సువాడ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ మర్యాదపూర్వకంగా భాస్కర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఖామర్ సుల్తానా గౌస్ మాట్లాడుతూ, ప్రజలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పోచారం భాస్కర్ రెడ్డి ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడని కొనియాడారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.అనంతరం పోచారం భాస్కర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ పాషా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం మహాదానం అని, ఒక యూనిట్ రక్తం ఎంతో మంది ప్రాణాలను కాపాడగలదని అన్నారు.
