27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉపాధ్యాయుడే విద్యార్థులకు ప్రేరణ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

పాఠశాల దశలో విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయుడు దశాబ్దాల కాలం గడిచినప్పటికీ ప్రేరణగానే నిలబడతాడని తెలియజేయడానికి ఆదివారం రెంజల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం మరొమారు స్పష్టం చేసింది. 1979-80వ విద్యా సంవత్సరం లో పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆనందోత్సాహాల మధ్య అద్భుతంగా జరిగింది. నాలుగున్నర దశాబ్దాల తరువాత సుమారు 60 సంవత్సరాలు దాటిన వారంతా ఒకచోటకు చేరి నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులను గౌరవ మర్యాదలతో సత్కరించడం సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర ఇనుమునింపజేసింది. ముందుగా పాఠశాల ప్రాంగణంలోని సరస్వతీ మాత విగ్రహానికి ఉపాధ్యాయులు అందర్నీ మంగళ వాయిద్యాలతో తోడుకొని వచ్చి పూల వర్షం నడుమ సరస్వతీ మాతకు పూజ చేసి తదనంతరం కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి ప్రస్తుత పాఠశాల ప్రధాన అధ్యాపకులు, ఆ పాఠశాల పూర్వ విద్యార్థి ఆంజనేయులు అధ్యక్షత వహించగా విజయానందరావు, లక్ష్మీకాంత చారి, మధు కృష్ణ, రెడ్డి ప్రకాష్, దారం గంగాధర్ తదితర ఉపాధ్యాయులని సభా వేదికపై తీసుకుని వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా దీపారాధన చేసి గతించిన ఉపాధ్యాయులు విద్యార్థులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీనియర్ ఉపాధ్యాయుడైన విజయానందరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు ఎల్లవేళలా విద్యార్థులకు ప్రేరణగానే ఉంటాడని అనడానికి ఈ సమావేశం రుజువు చేస్తుందని, 40 సంవత్సరాలకు పూర్వం చదువు చెప్పిన ఉపాధ్యాయులను సత్కరించడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపారని విద్యార్థులను కొనియాడారు. విచిత్రమైన సంఘటన ఏంటంటే ఈ నలభై ఆరు సంవత్సరాల లో చాలామంది విద్యార్థులు ఒకరినొకరు కలుసుకోనప్పటికీ ఈ సమావేశం కారణంగా కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవన్నారు. ప్రతి ఒక్కరూ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ 60 సంవత్సరాల పైబడిన వయసులో కూడా పదవ తరగతి విద్యార్థుల లాగే ప్రవర్తించడంతో వారిలో ఉన్న వినయ విధేయతలు ఉట్టిపడ్డాయి. ఈ ఆత్మీయ సమ్మేళనం అటు ఉపాధ్యాయులను ఇటు విద్యార్థులను ఉత్సాహపరిచింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు కృషిచేసిన నాటి విద్యార్థులు స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, సుదర్శన్ రాజ్, గంగాధర్ గౌడ్, మీరా సాబ్, బాలాచారి తదితరులును ఆనాటి మిత్రులందరూ అభినందించారు. ఉపాధ్యాయులను సత్కరించడంతోపాటు విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించడం ప్రత్యేకత సంతరించుకుంది.

More articles

Latest article