25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో ఆదివారం శ్రీ జోడ్ కనకదుర్గా దేవి ఆలయంలో ఆషాఢ మాస తొలి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బోనాల పండుగ ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే పోచారం స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొని, అనంతరం దుర్గా మాత గుడిలో అమ్మ వారిని దర్శించుకుని ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించేలా చల్లగా చూడాలని అమ్మవారిని భక్తితో ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆశాడమాస బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 

MLA Pocharam carries the Bonalu offering on his head.

More articles

Latest article