. . . దొంగలకు రాచమర్యాదలు
. . . బంగారం మొదలుకుని డబ్బుల వసూళ్లు
. . . దుబ్బాక పరిధిలో చోరితో జైలు అధికారుల వ్యహర శైలి బహిర్గతం
. . . దొంగతో కలిపి వార్డర్ పై చోరి కేసు నమోదు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ సెంట్రల్ జైలు ను వివాదాలు అప్పుడే వదిలేలా లేవు. ప్రధానంగా జైళ్ళ శాఖలో అవినీతిపై ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు దాడులు చేయకపోవడంతో జైళ్లో పని చేస్తున్నఅ ధికారులు మొదులుకుని సిబ్బంది అవినీతి పెచ్చరిల్లింది. జైళ్లో వార్డర్ , ఒక దొంగతో జరిగిన డీల్ వ్యవహరం నిజామాబాద్ సెంట్రల్ జైలులో అధికారుల, సిబ్బంది వ్యవహర శైలిని బట్టబయలు చేసింది. జైలులో దొంగతనాల ఇచ్చిన ప్రధానంగా బంగారం లాంటి భారీ చోరిల్లో పాల్గొన్న వారికి ఇచ్చిన ప్రియారిటీ ఇతరులకు ఇవ్వరనేది చర్చ జరుగుతుంది. ఏకంగా జైలులో అధికారులు దొంగల వద్ద బంగారంతో పాటు డబ్బులను తీసుకుని రాచమర్యాదలు చేస్తారనే అపవాదు ఉండనే ఉంది. రిమాండ్ నిమిత్తం లేదా జైలు శిక్షకు గురైన వారు సెంట్రల్ జైలు వచ్చింది మొదలు చెకింగ్ వద్దనే వారి హిస్టరిని గుర్తించి వారితో మిలాఖత్ అవుతారనే ఆరోపణలున్నాయి. అక్కడ జైలుకు వచ్చినప్పుడే దొంగల వద్ద ఉన్న సొత్తును డిపాజిట్ చేయకుండా వారి వద్ద ఉంచుకుంటారని కొంత సొమ్ము మాత్రమే డిపాజిట్ రూపంలో చూపుతారని సమాచారం.

తెలంగాణలో అతిపెద్ద జైళ్లలో ఒకటైన నిజామాబాద్ సెంట్రల్ జైలులో అధికారుల అవినీతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులు గతంలోని వివాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదని సిద్ధిపేట పోలిస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన దొంగతనం కేసు బహిర్గతం చేసింది. సిద్దిపేట్ జిల్లా దుబ్బాకలో ఓ వ్యాపారి కుటంబం కాశీయాత్రకు వెళ్లగా కిలోకు పైగా బంగారు అభరాణాలు దొంగలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిద్దిపేట్ పోలీసులు ప్రత్యేక బ`దాలను ఏర్పాటు చేసి గాలించగా బిక్షపతి అనే దొంగను చర్లపల్లి ప్రాంతంలో పట్టుకున్నారు. అతనే దుబ్బాక వ్యాపారి ఇంట్లో చోరి చేసినట్లు గుర్తించి తమదైన శైలిలో విచారణ జరుపడంతో నిజామాబాద్ జైలులో వార్డర్ తో జరిగిన డీల్ ను బహిర్గతం చేశారు. దానితో సిద్దిపేట్ కమిషనరేట్ పరిధిలో దుబ్బాకలో నిజామాబాద్ జైల్ లో వార్డర్ గా పని చేస్తున్న గోపాల్ ను చోరి కేసులో ఏ2గా నమోదు చేశారు. ఇప్పటికే అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న గోపాల్ ను జైళ్ళ శాఖాధికారులు ఇది వరకే సస్పెన్షన్ చేశారు. గతంలో గంజాయి విక్రయాలతో పాటు పాన్ మసాలాల సరఫరా వ్యవహరంలో జైలు సిబ్బంది ప్రమేయంపై వివాదాలు చెలరేగిన విషయం తెల్సిందే.
నిజామాబాద్ సెంట్రల్ జైలులో ములాఖత్ లు మొదలుకుని రాచమర్యాదలు అంటూ ఒక రేటు ఫిక్స్ చేసినట్లు జైలులో గడిపిన పాత నేరస్తులు చెబుతున్నారు. ఏకంగా ములాఖత్ లకు వచ్చే రిమాండ్ ఖైదీల, జైలు శిక్ష పడిన నిందితుల కుటుంబ సభ్యుల నుంచి డబ్బులను రప్పించుకుంటారని చెబుతున్నారు. ప్రధానంగా సెంట్రల్ జైలులో ఉన్న ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ఫోన్ లు చేయించి మరీ డబ్బులు వసూల్ చేయిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. సంబంధిత యూపీఏలను జైలు శాఖ అధికారులు తమ కింది స్థాయి సిబ్బంది ఖాతాలోకి వేయించుకున్న ఘటనలున్నాయి. దుబ్బాకలో చోరిలకు పాల్పడే బిక్షపతికి సహాయ సహకారాలు అందించి వాటా డిమాండ్ చేసిన గోపాల్ తన సొంత ఊరు నిర్మల్ కు రప్పించుకుని డబ్బులు వసూల్ చేసేవాడని టాక్. అంతేగాకుండా జైలుకు వెళ్లినప్పుడు వార్డర్ గా ఉన్నప్పుడే దొంగతనాల కేసులో వచ్చిన వారి వద్ద అప్పటికప్పుడు డబ్బులు తీసుకుని అక్కడ మర్యాదలకు కొదవ లేకుండా చూసుకునే వాడని తెలిసింది. నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో బంగారు వ్యాపారిని దోచుకున్న దొంగల ముఠా వద్ద జైలు అధికారులు ఫోన్ పే ద్వారా వసూల్ చేసిన నగదు వ్యవహరం ఇటీవల చర్చనీయాంశమైంది. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో అరెస్టు అయిన దొంగ నుంచి కూడా ఏకంగా బంగారంనే తీసుకుని సహకరించినట్లు సమాచారం. ములాఖత్ లు మొదలుకుని రాచమర్యాదలకు ఫిక్స్ డ్ అమౌంట్ ను వసూల్ చేయడంలో సెంట్రల్ జైల్ అధికారులు సిద్దహస్తలుగా ఉన్నారని జైలు నుంచి విడుదలైన వారే బహిరంగంగా చెబుతున్నారు.

