24.7 C
Hyderabad
Monday, August 3, 2026

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నార్కోటిక్ (ఈగల్) డీఎస్పీ సోమనాదం విద్యార్థులకు సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) పరిధిలోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలోని విద్యార్థులకు గురువారం నార్కోటిక్ (ఈగల్) డీఎస్పీ సోమనాదం మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై మనోజ్ కుమార్, పోలీసు సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయుని బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article