. . . నేర పూరిత బలప్రయోగం చేసినందుకు ఏడాది కఠిన జైలుశిక్ష
. . . నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ తీర్పు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
నలుగురు యువకులు వేలపాల లేకుండా మద్యం తాగుతు క్రైమ్ బీట్ పోలీసుల కంటపడటంతో ఇక్కడేం చేస్తున్నారు అని వారు ప్రశ్నించడంతో మద్యం మత్తులో ఆ నలుగురు యువకులు పోలీసుల విధులను నిరోధించి, నేరపూరిత చర్యలకు పాల్పడం… చివరికి కోర్టుచే జైలుశిక్షకు కావడం,నాలుగు వేల చొప్పున జరిమానా చెలించి, తాత్కాలికంగా జైలుశిక్ష సస్పెండ్ చేయించుకొని బతుకు జీవుడా అంటు బయటపడ్డ యువకుల నిజజీవిత కథ ఇది.నలుగురు ఇరవై, ముప్పై ఏళ్లవారే దీని అంతటికి కారణం మధ్యమే.అతిమధ్యం అనర్దదాయకం అనే నానుడి నిజమే కదా… ఇగ కేసు వివరాలలోకి వెలదామా…నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం డొంకల్ శివారు ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన రాజస్తాన్ దాబా లో కొంతమంది వ్యక్తులు ఉండటం గమనించి అక్కడికి వెళ్లిన క్రైమ్ బీట్ చేస్తూ బైక్ పైన 23జూన్, 2025 న తిరిగి తిరిగి అక్కడికి అర్ధరాత్రి ఒంటిగంటకు వెల్లిన పోలీస్ కానిస్టేబుల్ లు తోపారపు వినయ్, షౌకత్ అలీ. అక్కడ నలుగురు యువకులను” మీరిక్కడ ఎందుకు ఉన్నారు.. ఏమ్ చేస్తున్నారు”.. అని అడగడంతో తాగిన మైకంలో ఉన్న వారు “మీరెవరు మమ్మల్ని అడగటానికి “అని ఎదురు ప్రశ్నించడంతో మేము పోలీసులం అని చెప్పడంతో “పోలీసులు అయితే మాకేంటి “అంటు భూతుమాటలు తిడుతు పోలీసుల విధులకు ఆటంకం కల్పించారు. షౌకత్ అలీ రెయిన్ కోట్ ను చించివేసి ఇద్దరు కానిస్టేబుల్ లను కిందపడేసి చాతిపై కాళ్ళతో తన్ని, ఇద్దరు ఒక కానిస్టేబుల్ ను పట్టుకొనగా మరో ఇద్దరు బండరాయి, కట్టేతో కొట్టి హత్యయత్నం చేసేందుకు ప్రయత్నించగా దాబా యజమానులైన హరీరామ్, నారాయణ రామే లు అడ్డుపడి రక్షించినారనే నేర ఆరోపణలతో కూడిన చార్జీషీట్ ను నేరానికి పాల్పడిన వారు మోర్తాడ్ గ్రామానికి చెందిన దాల్మల్క భూపతి, నూతికట్టు శివ కుమార్, నూతికట్టు శ్రీవర్ధన్, తోపారపు శశి శేఖర్ లని పేర్కొంటూ నేర విచారణ అధికారి కోర్టులో దాఖలు చేశారు.అభియోగ పత్రం అదారంగా కోర్టు నేర న్యాయ విచారణ నిర్వహించగా సాక్షులు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం, ధ్రువీకరించున్న పత్రాలు, వస్తుగత సాక్ష్యాలైన స్టోన్, స్టిక్ లను మార్క్ చేసిన పిదప రెండు నేరాలలో నేర నిరూపణ నిర్దారణ అయినట్లు కోర్టు తెలిపింది.ముద్దాయిలు నలుగురు భూపతి, శివ కుమార్, శ్రీవర్ధన్, శశి శేఖర్ లపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 121(1) ఉద్యోగి విధులను నిరోదించడం గాపరచడం ప్రకారం మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా, సెక్షన్ 132 నేరపూరిత బలప్రయోగం ప్రకారం ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విదిస్తూ అదనపు సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ తీర్పు చెప్పారు.నలుగురిపై హత్యయత్నం, పబ్లిక్ న్యూసెన్ నేరారోపణలు రుజువు కాలేదని కోర్టు పేర్కొన్నది. ముద్దాయిల తరపున న్యాయవాదుల అభ్యర్థన మేరకు కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీలు దాఖలు చేస్తామని అందుకుగాను శిక్షలపై తాత్కాలిక సస్పెండ్ చేయాలని కోరడంతో తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ వారిని విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు విధించిన జరిమానాను ముద్దాయిలు చెల్లించడంతో ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో పాటు వ్యక్తిగత బాండ్ స్వీకరించిన కోర్టు వారిని విడుదల చేసింది. హైకోర్టు నుండి ముప్పై రోజులలోపు అదనపు సెషన్స్ కోర్టు తీర్పుపై తాత్కాలిక సస్పెండ్ ఉత్తర్వులు తీసుకురావడానికి చట్టం అవకాశం కల్పిస్తోంది.
