24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 28వ డివిజన్ లో పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని 28వ డివిజన్లో బుధవారం ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ లో ప్రతి ఒక్కరూ  భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా ఎన్యుమరేషన్ పత్రాలను పూర్తిచేసి సంబంధిత బిఎల్ఓ లకు అందజేయాలన్నారు. అనేకమందికి ఎనిమరేషన్ ఫామ్ నింపడంలో గందరగోళం ఏర్పడుతుందని, కావున ఓటర్లకు బిఎల్వోలు, పార్టీ బీఎల్ఎ లు సహకరించాలని సూచించారు. కార్పోరేటర్ల సైతం తమ పరిధిలోని ఓటర్లకు తగు సూచనలు చేస్తూ ఎన్యుమరేషన్ ఫామ్ లను  నింపి తిరిగి ఇచ్చేలా చూడాలన్నారు.

 

The SIR process needs to be expedited.

 

. . . ఎస్ఐఆర్ గడువు పెంపు

కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ గడుపును ఈ నెల 24 నుంచి ఆగస్టు 3వ తేదీకి పొడిగించిందని ఎమ్మెల్యే తెలిపారు. కావున నగరంలోని ఓటర్లందరూ గమనించి నిర్ణీత గడువులోపు ఎన్యుమరేషన్ పత్రాలను సంబంధిత బి ఎల్ ఓ లకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు మల్కాయి మహేందర్, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

 

The SIR process needs to be expedited.

More articles

Latest article