. . . వైద్య విద్యార్థులకు మరిన్ని సీట్లు పెరిగినాయ్
. . . నిజామాబాద్ లో వైద్యం . . . విద్యకు మంచి రోజులు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబిబిఎస్ విద్యా బోదనలో రాష్ట్రంలో ముందు వరుసలో నిలుస్తుంది. ఫలితాలలో రాష్ట్రంలోని ఉస్మానియా, గాంధీల తరువాత నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటు వస్తుంది. 2013 లో ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన సర్కార్ మెడికల్ కాలేజీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఇందూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనంగా 30 ఎంబిబిఎస్ సీట్లను కేటాయిస్తు జాతీయ వైద్య మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితాలలో, సౌకర్యాలతో, విద్యా బోధనలో ముందు వరుసలో ఉంటున్న మెడికల్ కళాశాలకు ప్రస్తుతం 120 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా అదనంగా 30 సీట్లు కేటాయించాలని వైద్య కళాశాల అధికారులు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) కి లేఖ రాశారు. గత నెల 17న మెడికల్ కళాశాలతో పాటు అనుబంధ జనరల్ ఆసుపత్రిని ఎన్ఎంసీ టీం తనిఖీ చేసి, పరిశీలన నివేదికను జాతీయ వైద్య మండలికి సమర్పించారు. దానికి సంత్రుప్తి చెందిన ఎన్ఎంసీ నిజామాబాద్ కు అదనంగా 30 సీట్లను కేటాయిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్ రిమ్స్, మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలకు మాత్రమే అదనపు సీట్లు పెరుగడం గమనార్హం.
ఎంబిబిఎస్ తో పాటు పీజీ బోధనలో……
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల తొలుత 100 ఎంబిబిఎస్ సీట్లతో ప్రస్తానం ప్రారంభించింది. 2018 లో 20 సీట్లను అదనంగా పెంచారు. నాలుగున్నరేళ్ల వైద్య, విద్యను అభ్యసించడానికి చాలా మంది విద్యార్ధులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం కళాశాలలో ప్రతి ఏటా 120 మంది విద్యార్థులు నాలుగున్నర సంవత్సరాల కోర్సులో 480 మంది ఎంబిబిఎస్ చదువుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరం లో సీట్ల సంఖ్య 150 కి పెరుగనుంది. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష లో మంచి ర్యాంకులు సాధించిన వారికి సీట్ రావడం ఖాయం. నిజామాబాద్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ తో పాటు పీజి లో ఎండి, ఎంఎస్ చదవడానికి 80 సీట్లు ఉన్నాయి. 2018 లో పీజీ సీట్ల ను కేటాయించారు. ఒక్క కమ్యూనిటి పర్సన్ కోర్సు మినహా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పిడియాట్రీక్స్, గైనకాలజీ, అనస్థిషియా, రేడియాలజీ, పాథాలజీ, ఇఎన్ టి, అప్తాల్మీక్, పల్మనాలజీ కోర్సులలో సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తరుపున అనాటమీ, బయో కేమిస్ట్రీ, పిజియాలజీ, పర్మాకాలజీ, ఫోరేన్సీక్ పీజీ కోర్సులు ఉన్నాయి. అంతే గాకుండా నిజామాబాద్ ప్రభుత్వ వైధ్య కళాశాలలో బిఎస్సీ అలైడ్ సైన్స్ కోర్సులు 110 సీట్లు, డిఎంఎల్ టి 30 సీట్లు, డయాలసీస్ 10 సీట్లు ఉన్నాయి. వైద్య విద్యకు కోట్లు ఖర్చు చేయాల్సిన తరుణంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు పెరగడం వలన నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్లా, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల విద్యార్ధులు కూడా ఇక్కడే చదువుకునేందుకు పెరిగిన సీట్లు దోహదం చేయనున్నాయి..

వైద్య కళాశాల దన్నుతో జీజీహెచ్ లో పేదలకు ఉచితంగా కాస్ట్లీ వైద్య సేవలు…..
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంబిబిఎస్ సీట్లు పెరుగడంతో అనుబంధ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో పేదలకు మరింత మంచి వైద్య సేవలకు ఆస్కారం ఏర్పడింది. ప్రస్తుతం 120 సీట్లకు అదనంగా 30 సీట్లు రావడం, ఇదివరకే ఉన్న 80 పీజీ సీట్లతో ధర్మసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఇప్పటికే ఉన్న సీనియర్ రెసిడెంట్ లు, పీజీ విద్యార్ధులు, ఇంటర్న్ షీప్ చేస్తున్న వారు వైద్య సేవలలో భాగంగా ఉన్నారు. వైద్య కళాశాలలో వివిధ విభాగాల అధిపతులు అనగా ప్రోఫెసర్ ల పర్యవేక్షణలో అసోసీయేట్ ప్రోఫెసర్లు, అసిస్టెంట్ ప్రోఫెసర్లు కలిసి జీజీహెచ్ లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏడు అంతస్థుల మేడతో పాటు పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ విబాగంలో సర్కారు సేవలు పేదలకు ఉచితంగా అందుతున్నాయి. ఇప్పటికే ఆసుపత్రిలో కార్డియాలజీ, నెప్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, అంకాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉంది. పేదలకు ఉచిత సేవలు అందించే నిజామాబాద్ గవర్నమెంట్ ఆసుపత్రికి అండగా వైద్య కళాశాలలో చదువుతో పాటు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
. . . వైద్య విద్యలో నిజామాబాద్ కాలేజీకి మంచి రోజులు
. . . కళాశాల ప్రిన్సిపాల్ అడిషనల్ డిఎంఇ ఫ్రో. క్రిష్ణ మోహన్..
నిజామాబాద్ గవర్నమెంట్ కు అదనంగా ఎన్ఎంసీ 30 ఎబిబిఎస్ సీట్లు కేటాయించడం మంచి పరిణామం.. రాష్ట్రంలో వైద్య విద్యలో పెరేన్నిక కలిగిన రెండు కాలేజీల తరువాత నిజామాబాద్ లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే పీజీ విద్యాతో పాటు అలైడ్ సైన్స్సెస్ కోర్సులలో విద్యా బోధన జరుగుతుంది. అదనంగా వచ్చిన సీట్లతో కలిసి ప్రతి ఏటా 150 మంది విద్యార్ధులు వైద్య విద్యను చదువుకోవాడానికి ఆస్కారం ఏర్పడింది. వైద్య విద్యను చదువాలనుకునే ఆశావాహులకు మంచి రోజులు వచ్చినట్లే…

