26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కులమతాలకు అతీతంగా ఊర పండుగ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

భీంగల్, బతుకమ్మ :

 

భీంగల్ పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతున్న “ఊర పండుగ” మహోత్సవంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముక్కోటి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం ప్రార్థించారు. భీంగల్ పట్టణ ప్రజలందరూ కులమతాలకు, అన్ని వర్గాల కుల సంఘాలకు అతీతంగా, చిన్న-పెద్ద తేడా లేకుండా ఏకతాటిపైకి వచ్చి ఈ ఊర పండుగను ఒక పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవడం పట్ల ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సామూహిక ఉత్సవంలో తాను భాగస్వామి కావడం, భక్తిశ్రద్ధలతో ఆ దేవతామూర్తులను దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, భీంగల్ పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article