27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతు ఆశీర్వాద సభ కాదు… కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు శాపనార్థాల సభ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రజా ధనంతో పబ్లిసిటీ స్టంట్లు బంద్ చేసి…హామీల అమలుపై దృష్టి పెట్టండి

 

. . . ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్‌తో..ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి పోలికా ?

 

. . . నేను మాట ఇస్తే తప్పను” అని అన్న రేవంత్ రెడ్డి ది ప్రపంచంలో నే 8వ వింత

 

. . . రుణమాఫీ కాదు . . రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మాఫీ అయ్యింది

 

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ :

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిన్న శిల్పకళా వేదికలో నిర్వహించింది రైతు ఆశీర్వాద సభ కాదని . . అది అన్నదాతల శాపనార్థాల సభ అని అన్నారు. బుధవారం వేల్పూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ చేయనందుకా, రైతుబంధు ఎగ్గొట్టినందుకా, వడ్లు కొననందుకా, యూరియా ఇవ్వనందుకా, కరెంట్ కట్ చేస్తున్నందుకా, దేనికి రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆశీర్వదించాలి అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సభల ఖర్చు చూస్తుంటే “చారాణా కోడికి బారాణా మసాలా” అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆర్భాటాలు , వృధా ఖర్చులు లేకుండా కేవలం ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించి, 11 సీజన్లలో రూ. 73వేల కోట్ల రైతుబంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని వృధా చేయలేదన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సీజన్లలో మూడు సీజన్ల రైతుబంధు ఎగ్గొట్టి  దాదాపు రూ. 28 వేల కోట్లు రైతులకు బాకీ పడిందని అన్నారు. ఈ రూ.28 వేల కోట్ల పాత బాకీలో నుంచి కేవలం రూ.2500 కోట్లు విదిల్చి  దాని కోసం వందల కోట్లతో సభలు పెట్టి అట్టహాసం చేయడం హాస్యాస్పదమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తదుపరి ఇవ్వబోతామంటున్న రూ. 9 వేల కోట్లు కూడా రైతుల పాత బాకీల కిందికే వస్తాయని, కొత్తగా ఇస్తున్నదేమీ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు ఎకరాకు రూ. 15 వేల చొప్పున ఇస్తే రైతులకు రూ. 55వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని,  కానీ ఇచ్చింది కేవలం రూ. 27 వేల కోట్లేనని  ఇంకా రూ.28 వేల కోట్లకు పైగా రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. బాల్కొండ నియోజకవర్గంలో 52 వేల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా, కేవలం 22 వేల మందికే జరిగిందని, మిగిలిన 30 వేల మంది రైతులు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. నిన్నటి రైతు సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేవలం స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం రైతాంగాన్ని నట్టేట ముంచడమేనని మండిపడ్డారు. రుణమాఫీ కాదు.. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మాఫీ అయ్యింది” అని ఎమ్మెల్యే అన్నారు. మంత్రి తుమ్మల ఏసీ రూముల్లో కూర్చొని యూరియా యాప్ బాగుందని, 90 శాతం రైతులు సంతోషంగా ఉన్నారని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లలోనే ఏకంగా రూ. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని, ఈ నిధులతో ఎం కట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సంస్కారహీనమైన భాషను, కేసీఆర్ పై చేస్తున్న వ్యక్తిగత దూషణలను మానుకోవాలని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశం లో రేగుంట దేవేందర్, జెడి నాగధర్ రెడ్డి, కల్లెడ ఏలియా ఆర్మూర్ మహేష్, బద్దం చిన్నారెడ్డి, రేగుల్లా రాములు, బద్ధం అశోక్, కుంట ప్రతాపరెడ్డి, పాపాయ్ పవన్, బోగా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article