నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
ఉద్యోగ బాధ్యతలుకు తోడు కుటుంబ బాధ్యతలు సమపాళ్లలో నిర్వహించుకుంటు పోవడంలోనే ఉద్యోగుల గొప్పతనం ఉన్నదని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ అన్నారు. ఒక చేతితో కాకుండా రెండు చేతులతో కత్తులు, బాణాలు సంధించే వృత్తినైపుణ్యం ఉద్యోగుల సొంతమని, వృత్తిలో విజయాలే కొలమానం గా బాధ్యతల బరువులు మోస్తారని ఆమె కొనియాడారు. ప్యామిలి కోర్టు ముఖ్య పరిపాలన అధికారి లక్ష్మీకాంత్, రెండవ అదనపు జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్ సంతోష్ ల పదవి విరమణ సందర్బంగా నిజామాబాద్ జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు. గృహిణుల సహకారం, తోడ్పాటుతో రెండు బాధ్యతలు నిర్వహించడం ఉద్యోగి నేర్చుకున్నాడని తెలిపారు. ఉద్యోగ వృత్తి జీవనంలో విమర్శలు రాకుండా చూసుకోవాలని ఆమె తెలిపారు.లక్ష్మీకాంత్ నలభై సంవత్సరాలకు పైగా, సంతోష్ ముప్పై సంవత్సరాలు న్యాయశాఖలో ఉద్యోగసేవలు అందించడం గొప్ప విషమేనని విషదీకరించారు. ఉద్యోగ విరమణ అనంతర జీవితం ఆనందంగా, సంతోషంగా గడిచి పోవాలని ఆమె ఆకాంక్షించారు. అదనపు జిల్లాజడ్జిలు సుగాలి నారాయణ, దారావత్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సీనియర్ ఉద్యోగుల నుండి జూనియర్ ఉద్యోగులు నేర్చుకోవలసింది చాలా ఉన్నదని అన్నారు.దశబ్దాల ఉద్యోగ వృత్తిలో ఉన్నవారు పదవి విరమణ చేయడం ఒకింత నష్టమేనని వారు అన్నారు. కార్యక్రమానికి జ్యూడిషియల్ ఉద్యోగుల సంగం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్లీడర్ అమిదాల సుదర్శన్, న్యాయవాది మాణిక్ రాజు,ఉద్యోగ సంగం నేతలు అనిశెట్టి చంద్రశేఖర్, రషీద్,దామోదర్ రెడ్డి, సుజాత, వెంకట లక్ష్మీ, అంజల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
