29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

యువత సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యలు కావాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కళాశాల ప్రిన్సిపాల్ జి. రాంబాబు

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. రాంబాబు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో ఎన్ఎస్ఎస్ యూనిట్-4 ఆధ్వర్యంలో శనివారం డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ యూనిట్-4 ప్రోగ్రాం ఆఫీసర్ నర్సయ్య విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. “డ్రగ్స్ వద్దు – బ్రతుకు ముద్దు” అనే నినాదంతో విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ నర్సయ్య మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

The youth must become partners in the development of society.

More articles

Latest article