23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ఓటరు నమోదులో అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మున్సిపల్ కోఆప్షన్ ఖామర్ సుల్తానా గౌస్ పాషా

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పట్ల ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలని, లేని పక్షంలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని మున్సిపల్ కోఆప్షన్ ఖామర్ సుల్తానా గౌస్ పాషా అన్నారు. శనివారం 13వ వార్డులోని బూత్ 227, 228 లో నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వేలో ఆయన స్థానిక వార్డు కౌన్సిలర్ ఖలేఖ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు బీఎల్వో అందించే ఎన్యూమరేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం కోఆప్షన్ ఖామర్ సుల్తానా గౌస్ పాషా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అత్యంత విలువైనదని, ఇది మన ప్రాథమిక గుర్తింపు అని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి ఓటు హక్కు ఉండటమే ప్రాతిపదిక అని స్పష్టం చేశారు.13వ వార్డు ప్రజలందరూ సర్వే కోసం వచ్చే అధికారులకు తమ వివరాలను వాస్తవంగా అందించాలని కోరారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా పేర్లు నమోదు చేసుకోవాలని, కార్డుల్లో ఏవైనా తప్పులుంటే సవరించుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు, మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు వీలుగా అధికారులకు పక్కాగా నివేదించాలని కోరారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు కలిగి ఉంటే అది చట్టవిరుద్ధమని, అట్టి వివరాలను సవరించాలని చెప్పారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే తమను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలోబిఎల్వో వాణి,కపిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article