30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఆడ ఉన్నా.. ఈడ ఉన్నా..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చెప్పడానికి లేదిక…!

 

. . . ఉదయం, సాయంత్రం హాజరు

 

. . . విద్యుత్ శాఖలో అమలు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

పని దొంగల భరతం పట్టడానికి విద్యుత్ శాఖ కంకణం కట్టుకుంది. రైతులకు, వినియోగదారులకు అందుబాటులో ఉండకుండా తప్పించుకు తిరిగేవారి కాళ్ళకు సంకెళ్ళు వేసే దిశగా కొత్తగా రెండు పూటల హాజరు అస్త్రాన్ని విద్యుత్ శాఖ ప్రయోగించింది. స్థానికంగా ఉండకుండా జిల్లా కేంద్రం నుంచి రాక పోకలు సాగించేవారికి, తరచుగా కార్యాలయాలకు డుమ్మా కొట్టేవారికి పెద్ద దెబ్బగా వర్ణించవచ్చు. నిర్వాహక పోస్ట్ గనుక తాము వెళ్లకున్న నడుస్తుందని విర్రవీగిన ఉద్యోగులకు నెత్తి మీద రాయి పడినట్లయింది. శాఖలో పని చేస్తున్న ఓ అండ్ ఎం సిబ్బంది, అకౌంట్స్ విభాగం తో పాటు  ఏఈ నుంచి ఎస్ఈ వరకు హాజరు పెట్టాల్సిందే.

 

Whether there or here...

 

. . . 50 మీటర్ల పరిధిలో

ఉద్యోగి పని చేసే ప్రాంతం నుంచి 50 మీటర్ల పరిధిలోనే ఈ హాజరు విధానం పని చేస్తుంది. సంస్థ రూపొందించిన యాప్ లో సెక్షన్ (విభాగం) నిక్షిప్తమై ఉంటుంది గనుక ఎక్కడ పోస్టింగ్ ఉందో అక్కడే  రేడియేషన్) హాజరు కోసం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల లోపు ఈ ప్రక్రియ ముగించాల్సి ఉంటుంది. సమయం దాటితే గైర్హాజరు పడుతుంది.

. . . మొక్కుబడిగా

ఉదయం వేళా విధులకు మొక్కుబడిగా వచ్చి వెళ్ళే వారికి తప్పించుకునే ఆస్కారం లేకుండా పోయింది. ఒక్కో విభాగంలో కొందరు ఏఈ లు విధులకు హాజరు కాగానే ఎస్టిమేషన్ (అంచనా) లు ఎన్ని వచ్చాయని అడిగి తెలుసుకొని దానికి సంబంధించి మామూళ్ల వేటలో పడేవారు. స్థానికంగా రైతులకు గాని, వినియోగదారులకు గాని కనీసం కింది స్థాయి సిబ్బందికైన అందుబాటులో ఉండకపోయేవారు. నిజామాబాద్ డివిజన్ లోని ఒక గణాంకాదికారి రాజధాని నుంచి, అదీనూ వారంలో రెండు లేదా మూడు సార్లు కార్యాలయానికి సమయపాలన లేకుండా వచ్చేవాడు. మద్యాహ్నం వేళ దాటగానే ఇంటి దారి పట్టేవాడు. ఇలాంటోళ్లకు ఈ యాప్ హాజరు సరైనదేననే అభిప్రాయాలను ఆ విభాగం సిబ్బంది వెలిబుచ్చుతున్నారు.

 

Whether there or here...

 

. . . సిబ్బందిలో మోదం ఖేదం

గ్రామాల్లో రైతులకు 24 గంటలు అందుబాటులో ఉంటూ పని చేసే ఓ అండ్ ఎం సిబ్బంది.. హాజరు విషయంలోనే ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు హాజరు కోసం వెళ్ళే పరిస్థితి నుంచి మినహాయింపు ఉండాలనే వాదన వినిపిస్తోంది. పని విషయంలో సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఏఈలు, ఏడిఈలు దొరకకుండా ఉండేవారు. ఇప్పుడు హాజరు పుణ్యమాని సాయంత్రం 6 గంటల వరకు ఉంటున్నారని ఓ అండ్ ఎం సిబ్బంది సంబరపడుతున్నారు.

. . . గదుల కోసం వెతుకులాట

ఉదయం పది లోపు హాజరు పడకపోతే గైర్హాజరు పడుతుంది. దీని వల్ల ఒక రోజు వేతనం కోత పడుతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే స్థానికంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. ఇన్నాళ్ళు  లేనిది తమకు ఇల్లు కిరాయికి కావాలని, చూసి పెట్టండని తెలిసిన వారికి చెప్తూనే, వారు సొంతంగా వెతుకులాట ప్రారంబించారు. స్థానికంగా ఉంటున్నామని చెప్తూ ఎవరో ఒకరి ఇంటిని చూపిస్తూ హెచ్ఆర్ఏ  తీసుకున్నారు. ఈ హాజరు వల్ల ఇన్నాళ్ళు సంస్థకు చూపించిన ఇంట్లోనా … లేక నిజంగా ఇల్లు కిరాయికి తీసుకోని ఉండడమా … అని  వారిలో వారే నిశ్చయించుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Whether there or here...

More articles

Latest article