నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్ హోదాకు పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారు మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన పదోన్నతుల ప్రక్రియలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సిబ్బందికి హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ లభించింది.

చాలా కాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి ఈ అవకాశం రావడంతో పోలీసు సిబ్బందిలో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన బి.సుదర్శన్, ఎన్. ప్రసాద్ లను పోలీస్ కమిషనర్ అభినందించి, వారి భవిష్యత్ సేవల్లో మరింత బాధ్యతాయుతంగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

