24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నెల రోజుల్లోగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . లేదంటే ఇక్కడే నిరాహార దీక్ష చేస్తా

 

. . . ప్రభుత్వానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అల్టిమేటం

 

. . . జెండా పండుగలో భాగంగా భూపాలపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ

 

భూపాల పల్లి, బతుకమ్మ :

 

డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇస్తున్నా, ఈ లోగా ఉద్యోగాలు ఇవ్వపోతే ఇక్కడే నేనే వచ్చి నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి బాయిబాటలో భాగంగా శనివారం భూపాలపల్లి కాకతీయ ఖని – 5 గని వద్ద కార్మికులతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ గత ఐదురోజులుగా కార్మికులతో మాట్లాడుతున్నానని, వాళ్లకు కనీసం తాగటానికి మంచి నీళ్లు కూడా ఇవ్వటం లేదని అన్నారు.  డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ఓ పెద్ద మనిషి కలిసి తన గోస చెప్పుకుంటే కళ్లలో నీళ్లు వచ్చాయని, కార్మికులను ఇబ్బంది పెడితే వారి గోస ఈ ప్రభుత్వానికి తగులుతుందని తెలిపారు. బొగ్గుబాయిల దగ్గర ఉండే ప్రజలు కనీసం కార్మికుడిగానైనా సింగరేణిలో జాబ్ వస్తుందని భావిస్తారని, రిటైర్ మెంట్ అవుతున్న వాళ్లు తమ పిల్లలకో, బంధువులకో డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించుకోవాలని భావిస్తారని, కానీ ఈ ప్రభుత్వం మాత్రం మెడికల్ బోర్డు పెట్టకుండా రిటైర్ మెంట్ కు దగ్గర్లో ఉన్న వాళ్లను ఆవేదనకు గురిచేస్తోందని మండిపడ్డారు.

 

Jobs for dependents must be provided within a month.

 

భూపాలపల్లిలో ఇవ్వాళ మొదటి జెండా ఎగురవేశామని, రానున్న రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్యే సీటు కూడా గెలుస్తామని, నిరంతరం నేను కార్మికుల పక్షానే ఉంటానని పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అని చెప్పి ఫ్రీ బస్ తప్ప ఒక్క గ్యారంటీని అమలు చేయలేదని, ఫ్రీ బస్ కారణంగా కూడా మహిళలు గొడవ పడుతున్నారని, పురుషులకు సీట్లు లేని పరిస్థితి వచ్చిందన్నారు. బస్సుల్లో వికలాంగులకు, 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్స్ కు కూడా ఉచిత ప్రయాణం అందుబాటులోకి తేవాలన్నారు. ఇక షాదీ ముబారక్, తులం బంగారం, కేసీఆర్ కిట్ ఇలా ఏవీ ఇవ్వటం లేదని, రేవంత్ రెడ్డి, భట్టి చెబితే నమ్మరని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చెప్పించారని, ఓట్లు వేసుకున్నాక వాళ్లు పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. అందుకే ఈ ప్రాంతం బాధలు తెలిసి…ఈ ప్రాంతం కోసం కొట్లాడే పార్టీ కావాలని, ఇంతకుముందున్న బీఆర్ఎస్ కూడా పార్టీలో తెలంగాణ పేరు వదిలి వేరే రాష్ట్రాలకు పోయిందని, కాంగ్రెస్, బీజేపీ మాదిరిగానే బీఆర్ఎస్ కూడా మారిపోయిందన్నారు.

 

Jobs for dependents must be provided within a month.

 

ఇప్పుడు మన ప్రాంతం గురించి మాట్లాడే వాళ్లు లేకపోవటంతోనే భయం లేకుండా పోయిందని, ఆడబిడ్డలకు ఇప్పటికీ మాకు ఇళ్లు కావాలని ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా నిజమైన పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, నిజమైన పేద మహిళలకు ఇళ్లు వచ్చేలా మేము కృషి చేస్తామన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం అయిన తర్వాత కూడా ఇక్కడ ఏమాత్రం వసతులు రాలేదని, ఈ ప్రాంతంలో ఉన్న బ్రిడ్జిలు పాడయ్యాయని, వాటి నిర్మాణం మీద దృష్టి పెట్టాలన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు రావాల్సిన అవసరం ఉందని, కానీ అవుటర్ రింగ్ రోడ్ లో రాజకీయ నాయకుల జాగాలు, ఇళ్లు ఉంటే రోడ్డును వంకర టింకర తిప్పుతున్నారన్నారు. ఈ ప్రాంతం జిల్లా కేంద్రమైన తర్వాత కూడా ఇంకా కుగ్రామం మాదిరిగానే ఉందని, కచ్చితంగా భూపాలపల్లిలో సౌకర్యాలు పెంచే ఏర్పాట్లు చేయాలని, అవుటర్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోయే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే భూకబ్జాలు చేశారు. చెరువులను కూడా వదలలేదని, బొగ్గు బాయిలు ఉండే ఈ ప్రాంతంలో అసలే పర్యావరణం బాగుండదని, అలాంటి చెరువులను కూడా కబ్జా పెట్టి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని మండి పడ్డారు. ఆయన ఘనకార్యం కారణంగా సుప్రీంకోర్టులో తెలంగాణ ఇజ్జత్ పోయిందని, ఆయన ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ కలిసి 190 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని గుర్తు చేశారు. అది అటవీ భూమియే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత కూడా ఆ భూమిని వదలటం లేదని, ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అవే పనులు చేస్తున్నాడన్నారు. మా సత్తెన్న మూడుసార్లు ఓడిపోయిండని ప్రజలు గెలిపిస్తే సత్తె నాశనం చేస్తున్నాడని, ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ కోసం 140 ఎకరాలను ప్రజలు ఇస్తే వారికి ఇప్పటికీ కూడా పరిహారం ఇవ్వలేదని, దీనిపై గతంలో ఉన్న ఎమ్మెల్యే గానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గానీ మాట్లాడటం లేదని, భూములు ఇచ్చిన వారికి కచ్చితంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

Jobs for dependents must be provided within a month.

More articles

Latest article