24.7 C
Hyderabad
Monday, August 3, 2026

యారియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

 

. . . మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఫేక్ ప్రభుత్వం. రైతులకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించి పరిపాలన చేతకాక దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యూరియా కోసం తీసుకువచ్చిన యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో రైతులు వందశాతం వ్యవసాయం మీద ఆధారపడిన వారని, వారికి యాప్‌ కారణంగా యూరియా దొరక్క వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతులకు సాగునీరు, ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు ఇలా అన్ని సమస్యలూ పరిష్కరించారు. వ్యవసాయం, టెక్నాలజీ, విద్య అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్లాం. కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ కి నీళ్లు ఇచ్చి బాన్సువాడ రైతాంగాన్ని ఆదుకున్నాం అని గుర్తు చేశారు. రైతు భరోసా, బోనస్, ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ ఇష్టానుసారం మాట్లాడారు కానీ ఇప్పుడు అన్నీ విస్మరించారు. రైతుబంధు సరిగా ఇవ్వడం లేదు. 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. పరిపాలన చేతకాని దద్దమ్మవు నీవు. దళారులు చెలరేగిపోతున్నారు అని మండిపడ్డారు. వ్యవసాయం గురించి రేవంత్కు ఏం తెలుసు? రేవంత్ బ్రోకర్ , ఇది చేతకాని ప్రభుత్వం. చేతకాకుంటే ఊరుకోవాలని విమర్శించారు. యూరియా కోసం యాప్లో అప్లై చేయమంటున్నారు. రైతుల దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఎక్కడివి? యాప్ రద్దు చేసి నేరుగా యూరియా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో  నియోజకవర్గ ఇంచార్జ్ తోట ఆగమయ్య, రైతు బంధు మాజీ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్,కౌన్సిలర్లు ఖలీల్, ఫెరోజ్ ఖాన్,మాక్బూల్, నాయకులు అక్బర్, బాడీ శ్రీను, ఖాదర్,తదితరులు పాల్గొన్నారు.

 

The Yaria app must be cancelled immediately.

More articles

Latest article