29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అవగాహన సదస్సును బహిష్కరించిన రైతులు

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట మండలం పరమల గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశాన్ని రైతులు బహిష్కరించారు. పరమల గ్రామంలోని రైతు వేదిక పరిధిలో గల రైతులకు శుక్రవారం యూరియా యాప్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించేందుకు వచ్చిన వ్యవసాయ శాఖ ఎల్లారెడ్డి ఏడిఏ సుధామహాదురికి రైతుల నుండి చేదు అనుభవం ఎదురయింది. యూరియా వెంటనే ఎత్తివేసి గతంలో మాదిరిగానే యూరియా పంపిణీ చేయాలని రైతులు అధికారులకు డిమాండ్ చేశారు.  లింగంపేట మండలంలో 26,000 ఎకరాల వ్యవసాయ భూమిని భూమికి సరిపడా యూరియాను ఆప్ ద్వారా కాకుండా సాధారణంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ ద్వారా యూరియా పొందడం కష్టంగా మారిందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు ఆన్లైన్ ప్రారంభించిన వెంటనే ఒక్క క్షణంలోని యూరియా లభించడం లేదన్నారు. యూరియా యాప్ తొలగించి సహకార సంఘాల గోదాములు ఎరువుల దుకాణాల ద్వారా సరఫరా చేయాలని అధికారులకు డిమాండ్ చేశారు. యూరియా యాప్ అవగాహన సదస్సుకు పర్మల్ల, సజ్జన్ పల్లి , ఎక్కపల్లి, మలోత్ తండా, షేట్పల్లి సంగారెడ్డి తదితర గ్రామాల చెందిన రైతులు హాజరయ్యారు. రైతులకు సరిపడా యూరియా బస్తాలు రైతులకు అందుబాటులో ఉంచి పట్టా పాస్ పుస్తకం ద్వారా రైతులకు అందించాలని అధికారులను కోరారు. యూరియా అప్ ను పూర్తిగా తీసివేయాలని డిమాండ్ చేస్తూ  ఇ సమస్యను ఉన్నత అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి రాజా గౌడ్, మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్, ఏఈఓ సంతోష్, రైతులు శ్రీను, లేగ్గేల రాజు, రవి, పల్లె రాజు, గంగారెడ్డి, సిద్దయ్య, దుర్గేశ్, ప్రభురాజు, సాయిలు, శంకరయ్యతో పాటు ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article