అవగాహన సదస్సును బహిష్కరించిన రైతులు

  లింగంపేట్, బతుకమ్మ :   లింగంపేట మండలం పరమల గ్రామంలోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశాన్ని రైతులు బహిష్కరించారు. పరమల గ్రామంలోని రైతు వేదిక పరిధిలో గల రైతులకు శుక్రవారం యూరియా యాప్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించేందుకు వచ్చిన వ్యవసాయ శాఖ ఎల్లారెడ్డి ఏడిఏ సుధామహాదురికి రైతుల నుండి చేదు అనుభవం ఎదురయింది. యూరియా వెంటనే ఎత్తివేసి గతంలో మాదిరిగానే యూరియా పంపిణీ చేయాలని రైతులు అధికారులకు డిమాండ్ చేశారు.  లింగంపేట మండలంలో...