26.2 C
Hyderabad
Monday, August 3, 2026

త్యాగాల వారసత్వం రాహుల్ గాంధీది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ అని ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ దేశ సమగ్రత, సామాజిక న్యాయం, ప్రజాసేవ కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా రాహుల్ గాంధీ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించే ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article