27.3 C
Hyderabad
Friday, July 31, 2026

భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కౌన్సిలర్ గఫర్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కౌన్సిలర్ గఫర్ సూచించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ గఫర్ విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు శాతం, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయ బృందం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమం అనంతరం విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రాజులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

One should reach high positions in the future.

More articles

Latest article