భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
. . . కౌన్సిలర్ గఫర్ ఎల్లారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కౌన్సిలర్ గఫర్ సూచించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శుక్రవారం తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ గఫర్ విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు...