దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

0 9,868

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియాల్ శివాలయం సమీపంలో డీడీఎన్ అధ్యక్షుడు వాసుదేవరావు శర్మ నేతృత్వంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు సీర్లవంచ కృష్ణమాచార్యులు, జిల్లా అధ్యక్షుడు అంజన్నప్ప మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహా ఆలయాలకు దర్శనార్థం వెళ్లే భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేలా మంత్రి కొండా సురేఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవోను శుభపరిణామంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని అర్చకుల జీవన పరిస్థితులు ఇప్పటికీ సంతృప్తికరంగా లేవని, అర్చకులకు నెలకు రూ.35 వేల వేతనం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ సేవల్లో నిమగ్నమై ఉండే అర్చకులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ సదుపాయాలు, చికిత్సా సహాయం అందించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజశేఖర్, క్యాషియర్ భాస్కర్, సేవాలాల్ మహారాజ్, శివ మహారాజ్, రామ్ మహారాజ్, సంగప్ప, వీరప్రసాద్, లింగం, శివ గురుమూర్తి, ఎస్.ఎస్. నగర్ గంగాధర్ తదితర అర్చకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.