29 C
Hyderabad
Monday, August 3, 2026

సీఎం డిప్యూటీ సీఎం లే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికుల ను మభ్య పెడుతున్నారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాసీపేట మైన్ 1ను పరిశీలించిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

 మందమర్రి, బతుకమ్మ:

పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎం లే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికుల ను మభ్య పెడుతున్నారు. డిపెండెంట్ ఉద్యోగాల తో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు తెరాస చీఫ్ కల్వంకుంట్ల కవిత అన్నారు. మందమర్రి “బొగ్గుబాయి” కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ 1 టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ అండగా ఉంటుంది అన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. తెలంగాణ లో కొత్త రాజకీయ శక్తిగా వచ్చాం. సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చాను.

They are misleading Singareni workers by merely submitting representations to the Chief Minister and Deputy Chief Ministe

తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కలిసి పని చేశాం అని గుర్తు చేశారు నేను ఎక్కడ ఉన్న కూడా అనునిత్యం మీ పక్కనే ఉండి పోరాటం చేశాను. సింగరేణి మెడికల్ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ను ముట్టడించాం అన్నారు. ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.  హైదరాబాద్, ఢిల్లీలో ఉండి మనకు బొగ్గు బావులు తేవాల్సిన సీఎం, డిప్యూటీ సీఎం లు మీకు వినతి పత్రాలు ఇస్తున్నారు. మనకు ఐటీ సమస్యలు లేకుండా, నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన పనులు ఈ ప్రభుత్వం చేయడం లేదు అన్నారు.చేయాల్సిన పనులు చేయకుండా ఇక్కడకు వచ్చి కార్మికులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  కానీ కార్మికులతో నిరంతరం ఉంది ఎవరు పోరాటం చేస్తారో మీ అందరికీ తెలుసు మనకు ముఖ్యంగా హక్కుగా రావాల్సిన డిపెండెంట్ ఉద్యోగాలఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సి ఉంది. సింగరేణి బొగ్గు బావులు తెచ్చుకుంటే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇవ్వవచ్చు.  కానీ అన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని, అండర్ గ్రౌండ్ మైనింగ్ ను రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు అని కవిత ఆరోపించారు.

They are misleading Singareni workers by merely submitting representations to the Chief Minister and Deputy Chief Ministe

More articles

Latest article