నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ సెలవులో వెళ్లారు. తిరిగి విధుల్లో చేరుతారా అనే సంశయం వ్యక్తం అవుతున్నాయి. ఇంచార్జి గా తాత్కాలికంగా అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ కి అప్పగించినట్టు తెలిసింది. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం నాడు జరిగిన పరిణామాల నేపథ్యంలో మనస్థాపం తోనే డిఈఓ సెలవులో వెళ్లినట్టు తెలిసింది. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయూల ఎంపిక పై విమర్శలు వచ్చాయి. అంతేగాకుండా సర్వ శిక్ష అభియాన్ లో జరిగిన పనులపై అధికార యంత్రాంగం సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. ఇదే విషయం పై డిఈఓ పై బహిరంగంగా చేసిన వాఖ్యలు మనస్థాపం తోనే సెలవ్ పెట్టడానికి కారణం అని డైట్ కు తిరిగి పంపాలని కోరుతున్నట్టు తెలిసింది. త్వరలో నే రెగ్యులర్ అధికారికి ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.
