32.2 C
Hyderabad

సహకార సంఘాల్లో నామినేషన్లను నిలిపివేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మండల ప్రతిపక్ష నేత మధుసుదనా చారీ

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

సహకార సంఘాల్లో ఎన్నికైన సింగిల్ విండో చైర్మన్లను కొనసాగించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు శనివారం లోక్ భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. ఈ సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, సహకార సంఘాల చైర్మన్లు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మధుసూదనాచారి, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సహకార సంఘాల్లో నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది సహకార సంఘాల చట్టానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. 2020 లో ఎన్నికైన చైర్మన్ల పదవీకాలం 2025 వరకు కొనసాగుతుందని, ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తులను నామినేట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు మధుసూదనాచారి వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

 

Nominations in cooperative societies should be stopped.

More articles

Latest article