27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మద్నూర్‌లో కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

 

జుక్కల్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కట్టుబడి పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డోంగ్లీ ఎమ్మార్వో రంజిత్ కుమార్‌తో పాటు డోంగ్లీ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక అండగా నిలుస్తూ కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై ఆనందం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article