హజీపూర్ తాండా రహదారిపై రైతుల నిరసన
ఎల్లారెడ్డి, బతుకమ్మ:
కళ్లాల వద్ద ధాన్యం కాంటాలు నిర్వహించి రోజులు గడుస్తున్న మిల్లులకు తరలింపులో జాప్యంపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా వద్ద రోడ్డుపై రైతులు నిరసనకు దిగారు. రోడ్డుపై ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి ధహనం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు జరిగి నెల గడిచిన ఇప్పటికే లారీలు పంపడం లేదన్నారు. ధాన్యం అరబెట్టిన నాటి నుంచి తరలింపు వరకు బాధ్యత అని కాపలకు సరిపోతుంది అన్నారు. ఒకవైపు వానలు కురుస్తుండటంతో దాని కోసం నిరంతరం కాపాల కావాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాత్రింబవళ్లు కాపాలతో పాటు ఎండకు కూడా ధాన్యం వద్ధ తరలింపు ఎప్పుడు అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చెబుతున్నప్పటికీ ధాన్యం మాత్రం తరలించడం లేదని హమాలీల , గన్ని బ్యాగుల కొరత తో పాటు ఇప్పుడు లారీల పేరుతో వారాలు గడిచిపోతున్నాయన్నారు. విషయం తెలిసిన తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఎల్లారెడ్డి ఎస్ ఐ రాజు హాజీపూర్ కు వెళ్లి రైతులను సముదాయించారు. వారం రోజుల్లో మొత్తం ధాన్యం తరలించేందుకు హమీ ఇచ్చారు. రైతులు రోడ్డుపై ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలపడం తో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రైతులు అధికారులు హామీ మేరకు ఆందోళన విరమించారు.

