26.2 C
Hyderabad
Monday, August 3, 2026

కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధన కోసం ఉద్యమించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భారత విప్లవోద్యమ శిబిరంలో ప్రతిపాదించిన కుల, వర్గ సైద్ధాంతిక యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధన కోసం ఉద్యమించాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో మారోజు వీరన్న 28వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం మార్క్సిస్టు దృక్పథంతో ఉద్యమిస్తే ఈ దేశంలో ఎలాంటి విప్లవాన్ని సాధించలేమని ఆధునిక భారత సామాజిక విప్లవ నిర్మాత మహాత్మా జ్యోతి బా పూలే, సావిత్రమ్మ ఫూలే, నారాయణ మేఘాజీ, లోఖాండే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ల స్పూర్తిని మార్క్సిజానికి అన్వయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బని లత, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు టి.సంజయ్, జిల్లా కమిటి సభ్యులు డి నరేందర్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం నగర నాయకులు పద్మిని వాగ్మారే శంతా బాయి భూ లక్ష్మి లు పాల్గొన్నారు.

More articles

Latest article