కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధన కోసం ఉద్యమించాలి

  . . . బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   భారత విప్లవోద్యమ శిబిరంలో ప్రతిపాదించిన కుల, వర్గ సైద్ధాంతిక యోధుడు కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధన కోసం ఉద్యమించాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో మారోజు వీరన్న 28వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...