24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఎన్ టిఎ ను రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బాధ్యులను కఠినంగా శిక్షించాలి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పత్రం లీకేజీ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీక్ చేయడం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని, గతంలో కూడా అనేక సార్లు లీక్ కావడం జరిగిందని, ఎన్ టిఎ ప్రతిష్టమైన నిఘా ఉంచడం లేదని, పరీక్ష పత్రం లీక్ కావడం వల్ల నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనీ మండిపడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవస్థ గతంగా విఫలమైందని, ఈ ఘటనలో పరీక్ష పత్రం లీక్ చేసిన ప్రొ.కులకర్ణిని, దీని వెనుక ఉన్న ముఠాను కఠినంగా శిక్షించాలని, లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడిన ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

More articles

Latest article