వెబ్ డెస్క్, బతుకమ్మ :
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లను కల్పించాలని రైల్ రోకో చేపట్టిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కోర్టుకు హాజరయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నవంబర్ 28 న కామారెడ్డి లో కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు రైల్ రోకో చేపట్టగా కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు ఈ నెల 12 న సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లో గల సికింద్రాబాద్ సెకండ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.

