. . . జాయింట్ వీల్ ఎక్కిన మహిళకు గుండె పోటు
. . . నిజామాబాద్ ఎగ్జీబిషన్ లో ఘటన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
ఎత్తైన జాయింట్ వీల్ ఎక్కి సరదాగా గడపాలని అనుకున్న మహిళ గుండె పోటుకు గురైంది. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆమే ప్రాణాలు పోగోట్టుకుంది. ఈ సంఘటన 43 వ నిజామాబాద్ వ్యవసాయ పారిశ్రామీక ప్రదర్శన (ఎగ్జీబిషన్) లో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా డోంకేశ్వర్ మండలం నూత్ పల్లి గ్రామానికి చెందిన కొట్టూరు కళ్యాణి (33) సంవత్సరాల వివాహిత కుటుంబ సమేతంగా ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో జరుగుతున్న ఎగ్జీబిషన్ కు వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యుల కోరిక మేరకు జాయింట్ వీల్ ఎక్కిన కళ్యాణి పైననే ఎత్తులో ఉన్నప్పుడే గుండెపోటుకు గురయ్యారు.

వెంటనే జాయింట్ వీల్ వేగంను నియంత్రించిన తరువాత కళ్యాణిని అత్యవసర వైద్య సేవలకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్యాణికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. జాయింట్ వీల్ ఎక్కిన కళ్యాణి సరదా తీరకుండానే గుండెపోటుతో మరణించడం తో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ప్రతి ఏటా లక్షల మంది ప్రజలు నిర్ణీత రూసుం (ఎంట్రీ పీజు రూ.20 చెల్లించి) సందర్శించే వ్యవసాయ పారీశ్రామీక ప్రదర్శన కేంద్రం (ఎగ్జీబిషన్) వద్ధ అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన అంబులేన్స్ సేవలు లేకపోవడం దారుణం. ఎగ్జీబిషన్ సోసైటి నిర్వహకుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

