25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పెన్షన్ బాంచెన్..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పది రోజులు గడుస్తున్న ఇంకా అందని పెన్షన్స్

 

. . . ఆందోళనలో వృద్ధులు, వికలాంగులు

 

ఇందల్ వాయి, బతుకమ్మ

 

రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు నెల గడిచి పది రోజులు గడుస్తున్న ఇప్పటివరకు పెన్షన్ చేతికి అందకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. పెన్షన్ దారులు మాట్లాడుతూ తమ చేతికి నెల నెల సరైన సమయంలో పెన్షన్ వస్తేనే తమకు అంతో ఇంతో ఆసరాగా ఉంటుందని, చాయి నీళ్లు కూడా తాగే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెన్షన్ సరైన సమయంలో ప్రతి నెల అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పెన్షన్ దారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

More articles

Latest article