నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
డబ్బు పై ఆశ పెంచుకున్న భార్య భర్తలు సులభంగా డబ్బు సంపాదించేందుకు విచిత్రమైన దందాకు పూనుకున్నారు. లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్న కేసు లో బుక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి డబ్బుల వసూళ్లకు తెరలేపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని భార్యభర్తలకు కటకటాల వెనక్కి పంపారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మథ్కేడ్ తాలూకా ముక్రంబాద్ గ్రామానికి చెందిన మంగేష్కర్ గైక్వాడ్, ఉజ్వల గైక్వాడ్ భార్యభర్తలు, వీరు నగర శివారులోని మాధవ్ నగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న వీరు గలీజ్ దందాకు తెరలేపారు. ఉజ్వల గైక్వాడ్ రెండు నెలలుగా కంఠేశ్వర్ బైపాస్, ఆర్మూర్ రోడ్డులో నిలబడి ఒంటరిగా బైక్ పై వెళ్తున్న వారికి సైగలు చేస్తూ దగ్గరికి పిలుస్తుంది. అనంతరం రేటు మాట్లాడుకుని బైక్ పై అతడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తుంది. అయితే ఆమె భర్త వారిని ఫాలో అవుతూ వెనుక వెళ్తాడు. అక్కడకు వెళ్లాక బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇద్దరూ ఇలా పలు ప్రాంతాల్లో బైక్ పై వెళ్లెవారిని శ్రంగారం పేరుతో తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడని కేసు పెడతామని బెదిరించి డబ్బులు దండుకున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిఘా వేసి ఈ నెల 9న భార్య భర్తలను నగరంలోని గూపన్ పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా నేరం చేసినట్లు వారు ఒప్పుకున్నారు.
