27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్ర ప్లీనరీ ని విజయవంతం చేద్దాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

త్వరలో నిర్వహించబోయే రాష్ట్ర ప్లీనరి ని విజయవంతం చేద్దామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జిల్లా ప్లీనరి కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు మే 12 న జలవిహార్ లో టీజెస్ పార్టీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్ర ప్లీనరి లో బీసీ రిజర్వేషన్ లు, నిరుద్యోగ సమస్యలు, రైతాంగ సమస్యలు, కార్మికుల సమస్యలు చర్చ జరుగుతుందని, రాష్ట్ర ప్లీనరి ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. అదే విదంగా కామారెడ్డి జిల్లా లో సాగు నీరు కోసం కృషి చేద్దామని, ప్రాజెక్టు లు పూర్తి కావాలని, రాబోయే రోజులలో జిల్లాలో పర్యటించి అభివృద్ధి కోసం కృషి చేద్దామని అన్నారు. అనంతరం జిల్లా పార్టీ కమిటిని ప్రకటించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గా రజనీకాంత్, ఉపాధ్యక్షులు గా పూల్సింగ్, లల్సింగ్, కార్యదర్శి లు సంగరాజు, వర్షిత్, సంజీవ్, విజయ్ కుమార్, మహిళా అధ్యక్షులు గా నాగరాణి లను ప్రకటించారు.

More articles

Latest article