30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

 

బాల్కోండ, బతుకమ్మ:

పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి దూకి యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పోలీస్ స్టేషన్ భవనం పైనుంచి  ఒ యువతి (20) ఆత్మహత్య యత్నం చేయగా అమేను చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. బాల్కోండ కు చెందిన యువకుడు వివాహితుడైనప్పటికి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే తన జీవితం నాశనమైందని మనస్థాపం చెందిన యువతి స్థానికంగా ఉన్న మరో  పోలీస్ స్టేషన్ ( ముప్కాల్) భవనంపై నుంచి దూకింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న యువతి బంధువులు, పోలీసులు షాక్ కు గురయ్యారు. హుటాహుటిన యువతిని ఆసుపత్రికి తరలించారు. యువతి ఆత్మహత్యకు కారకుడైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలిస్ అధికారులను ఈ విషయంలో వివరణ కోరితే కేసు నమోదు తమ పిఎస్ లో జరుగలేదని చెప్పడం గమనార్హం. బాధిత యువతీ తీవ్ర గాయాలతో చావు బ్రతుకుల మద్య ఆసుపత్రిలో చికిత్స పోందుతుంది.

More articles

Latest article