28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఇటీవల విడెదలైన 10వ తరగతి ఫలితాల్లో ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తాండకు చెందిన గిరిజన విద్యార్థినీ సభావాట్ హారిక 564/600 మార్కులు సాధించింది. గ్రామపంచాయతీలో అత్యున్నత మార్కులు సాధించిన హారికకు వారి తల్లిదండ్రులకు శుక్రవారం హాజీపూర్ తండా స్థానిక సర్పంచ్ రతన్, పంచాయతీ కార్యదర్శితో పాటు వార్డు సభ్యులు శాలులతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు  భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. హారిక విజయాలు కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందాన్ని ప్రోత్సహించిన తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ రతన్, ఉపసర్పంచ్ శివరాములు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు అనుష, నరేష్, రవీందర్, గ్రామపంచాయతీ సిబ్బంది సుభాష్, మోతిరామ్, శ్రీను తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article