ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి సన్మానం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఇటీవల విడెదలైన 10వ తరగతి ఫలితాల్లో ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తాండకు చెందిన గిరిజన విద్యార్థినీ సభావాట్ హారిక 564/600 మార్కులు సాధించింది. గ్రామపంచాయతీలో అత్యున్నత మార్కులు సాధించిన హారికకు వారి తల్లిదండ్రులకు శుక్రవారం హాజీపూర్ తండా స్థానిక సర్పంచ్ రతన్, పంచాయతీ కార్యదర్శితో పాటు వార్డు సభ్యులు శాలులతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు...