ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

0 9,901

 

. . . నేరస్తుడి దగ్గర నుంచి 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహానాల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తున్ని శుక్రవారం ఎల్లారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి పట్టణంలోని న్యూ అబాది కాలనీలో నివసిస్తున్న నేరస్తుడు మహమ్మద్ అహ్మద్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత కొంత కాలంగా ద్విచక్ర వాహానాల దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. అతను డూప్లికేట్ తాళాలు ఉపయోగించి బైక్‌లను దొంగతనం చేసి, వాటి నంబర్ ప్లేట్లను మార్చి తన అవసరాలకు వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. పోయిన ఆదివారం ఎల్లారెడ్డి వారం సంతలో పార్క్ చేసిన ఒక టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని దొంగతనం చేసిన అనంతరం మరిన్ని వాహనాలను దొంగతనం చేయాలనే ప్రయత్నంలో ఉండగా, పోలీసులు సాంకేతిక ఆధారాలు, నమ్మకమైన సమాచారంతో నేరస్తుడిని గుర్తించి శుక్రవారం అతని నివాసంలో పట్టుకున్నారు. నేరస్తుడి దగ్గర నుంచి హీరో హోండా ప్యాషన్ ప్రో (బ్లూ కలర్), టివిఎస్ ఎక్స్ఎల్ (గ్రీన్ కలర్), హీరో హోండా సిడి 100 ఎస్ఎస్ (రెడ్ కలర్), టివిఎస్ ఎక్స్ ఎల్ (గ్రీన్ కలర్), హీరో హోండా ప్యాషన్ ప్లస్ (రెడ్ కలర్) లు కలిపి ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలలో కొన్ని వాహనాల నంబర్ ప్లేట్లు మార్చబడినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల మొత్తం విలువ సుమారు రూ. 200000/- గా అంచనా వేయబడింది. నేరస్తుడిని రిమాండ్‌కు తరలించగా, ఈ కేసుతో సంబంధం ఉన్న మరిన్ని వివరాలపై విచారణ కొనసాగుతోందన్నారు. ఈ ఆపరేషన్‌ను డిఎస్ పి ఎల్లారెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో, సిఐ ఎల్లారెడ్డి డి.రాజారెడ్డి ఆధ్వర్యంలో, ఎస్సై బి. మహేష్, సిబ్బంది ఎస్ఐ – 2 సుబ్రహ్మణ్య చారి, ఎఎస్ఐ దేవగౌడ్, పీసీలు ఇద్రిస్, అనిల్ గౌడ్, సంజీవ్, రాజేశ్వర్ రావు, హెచ్ జి గజీరాం కలిసి సమర్థవంతంగా కేసును ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిబ్బందిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.