24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మేడే స్పూర్తితో పోరాటాలు కొనసాగించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కార్మిక ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలిపిన వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మేడే స్పూర్తితో పోరాటాలు కొనసాగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. మోపాల్ మండల కేంద్రం లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 140 వ మేడే వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న కార్మిక ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, 8 గంటల పనిదినాన్ని ఈ దేశంలో మోడీ ప్రభుత్వం 44 చట్టాలను కుదించి 4 కోడ్ లుగా మార్చి పని గంటలను పెంచుతున్నారన్నారు. దీనితో పాటు వ్యవసాయ రంగంలో తెచ్చిన నల్ల చట్టాల వల్ల ఆ రంగంలో రైతులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని వారన్నారు. వీటికి నిరసనగా కార్మిక ప్రజలు, రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బలమైన సమర శిలా ఉద్యమాలు మేడే పోరాట స్ఫూర్తితో కొనసాగించాలని వారు కోరారు.

More articles

Latest article