. . . డా. స్వామి పరమార్ధ దేవ్ జీ
రుద్రూర్ బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో యజ్ఞ సహిత యోగ, ధ్యాన ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. స్వామి పరమార్ధ దేవ్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఏదైనా సాధించడానికి ఆరోగ్యం ఎంతో అవసరం అని ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చుని ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. ఈ ఆరోగ్య పరిరక్షణ కొరకు పరమపూజ్య స్వామి రాందేవ్ మహారాజ్ యోగాను విశ్వ వ్యాప్తం చేయాలనే సంకల్పంతో ప్రజలందరికీ యోగా ద్వారా శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందిస్తున్నారని సూచించారు. అనంతరం స్వామీజీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర బీఎస్టి ప్రబారీ శ్రీధర్ రావు, శివకుమార్ పటేల్, తెలంగాణ రాష్ట్ర పతాంజలి యోగ సమితి రాష్ట్ర ప్రబారీ వి. శివుడు, నిజామాబాద్ బిఎస్టి జిల్లా అధ్యక్షులు గంజి సాయన్న, నిజామాబాద్ పతాంజలి యోగ సమితి అధ్యక్షులు తొర్తి బుచ్చన్న, రామముని బచ్చురాజ్ ప్రకాష్, తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా డా. విశ్వనాథ్ మహాజన్, బీఎస్టీ అధ్యక్షులు కేవి. మోహన్, గంగాధర్, యోగా సమితి సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

