29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఎం జిల్లా కార్యదర్శి బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శిబాబు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సమ్మె గురువారానికి రెండవ రోజు చేరుకున్నందున సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వం వీలినం చేసుకొని కార్మికులకు న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సారలు గడుస్తున్న కార్మికుల వేతన ఒప్పందాన్ని ఇంతవరకు చేయకుండా కాలయాపన చేయటంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీని వదిలించుకోవడం కొరకు ప్రైవేట్ వ్యక్తులకు ఎలక్ట్రికల్ బస్సులను అప్పగించటం మూలంగా ఆర్టీసీ నష్టాల పాలవుతుందని, అందువల్ల ప్రభుత్వమే బస్సులను కొనుగోలు చేసి నడపాలని ఆయనన్నారు. కార్మికుల న్యాయమైన పోరాటానికి పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article