26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్టీసీ ఉద్యోగుల స్ట్రైక్ ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డిపో గడప దాటని ఆర్టీసీ బస్సులు

. . . ఈవి బస్సులు మాత్రమే రోడ్డుపై పరుగులు

 నిజామాబాద్, బతుకమ్మ:

ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రభుత్వం తో మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దానితో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బుధవారం ఉదయం ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. ఉదయం నుంచి ఆర్టిసీ జేఎసీ నాయకులు డిపోల ఎదుట నిరసన తెలిపి, బస్ స్టాండ్ ల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.దానితో ఆర్టిసీ బస్ స్టాండ్ లు ప్రయాణికులు లేక వెల వెలబోయాయి. సమ్మె  జన  జీవనం పై ప్రభావం పడింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో ఆరు డిపోల పరిధిలో 650 బస్సులు ఉన్నాయి. ఉదయం నుంచి కేవలం 87 వరకు ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. దానితో అ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.

https://batukammanews.com/rtc-employees-strike-effect/

 

అంతే కాకుండా మహలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సేవల కారణంగా మహిళలు ఇప్పుడు ఆ సేవలు అందడం కష్టంగా మారింది. ఒక్క నిజామాబాద్ రీజియన్ పరిధిలో నిత్యం కోటిన్నర ఆదాయం వచ్చేది. ఆర్టీసీ సమ్మె కారణంగా ఆదాయం గండిపడింది. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రైవేటు వాహనాల బాదుడు షూరు అయింది. నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాల యాజమానులు టికెట్ ధరలు పెంచుతున్నాయి. బస్సు లు లేకపోయినా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే స్టేషన్ ల వద్ధ ప్రయాణికులు బారులు తీరారు. బుదవారం ఆర్టీసి జేఎసీ నాయకులతో చర్చలు జరిగే అవకాశం ఉంది…

RTC employees' strike effect
RTC employees’ strike effect

More articles

Latest article