. . . తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకుంది కేసీఆర్
. . . ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ను సెంట్రలైజ్ కరప్షన్ చేశాడు
. . . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
హైదరాబాద్, బతుకమ్మ :
కేసీఆర్ కు తెలంగాణపై నయాపైస ప్రేమ లేదని, కేసీఆర్ చావాలని ఎవరు కోరువడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ చావు చూడాల్సి ఉందని హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల సభలో కేసీఆర్ మాటలకు అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ఏడాదికోసారి కేసీఆర్ బయటకు వస్తున్నారని, ప్రతిపక్ష నేతగా ప్రజల్లో ఉండాల్సిన కేసీఆర్ శకం ముగిసిందన్నారు. కూతురు జైలుకు వెళ్లడం కేసీఆర్ చూశారని, కొడుకు కూడా జైలుకు వెళ్లడం చూడాల్సి ఉందన్నారు. కొడుకు, కూతురిని తిరిగి అమెరికాకు పంపిస్తే తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు. హరీష్ , సంతోష్ లను కూడా పంపిస్తే మొత్తం దరిద్రం పోతుందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే గల్ప్ వలసలు ఆపుతారని చెప్పారని ఆయన ఇంట్లో నుంచి ఇద్దరు వలస వెళ్తే తిరిగి తీసుకువచ్చి పునరావాసం కల్పించారని ఎద్దేవా చేశారు. మంత్రి పదవి ఇవ్వనందుకే కేసీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్నిరాజకీయంగా వాడుకుందని ఆయన ఒక్కరేనని మండిపడ్డారు. పదేళ్ళ కాలంలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ను అవినీతి కోసమే సెంట్రలైజ్డ్ కరప్షన్ డిపార్ట్ మెంట్ గా , మిషన్ కాకతీయతో పాటు కాళేశ్వరం పనులు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లకు లాగుల అతిప్రేమ అని వ్యాఖ్యానించారు. రైతుల కోసం కేసీఆర్ పట్టించుకోలేదని, రేవంత్ ది కూడా అదే తీరని ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ పాలసే లేదని ఆయన మండిపడ్డారు. రైతులు కష్టపడి పండించిన పంటలు వానలకు తడిచిపోతున్న కొనుగోలు చేయడం లేదని అన్నారు. ఎఫ్ సిఐ కేవలం ఫుడ్ సెక్యూరిటీ కోసమే ధాన్యం సేకరిస్తుందని మొత్తం కొనుగోలు చేయాలని ఎలా అంటారని ప్రశ్నించారు. తెలంగాణలో రైస్ బ్రాన్ ఇండస్ట్రీయల్ తో పాటు వరి ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు స్థాపిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. నేను రిటైర్డ్ అయ్యేలోపు పసుపు ధరను క్వింటాల్ కు రూ.30 వేలు దాటిస్తానని అన్నారు. తాను రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయించానని గుర్తు చేశారు.
