28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ర్యాంకులు కాకతీయ వశం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో ఇంటర్మీడియట్ చదువుతు తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ర్యాంకులను కాకతీయ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలో తమకు ఎలాంటి బ్రాంచీలు లేకున్న తొలి ప్రయత్నంలోనే ఇంటర్ విద్యార్ధులు జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారని కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ సి హెచ్.విజయ లక్ష్మి తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్ధులు ఎస్.హేమ 132, రాఖీ 1763, రమాదేవి 2800, బి సంధ్య 2984, ఎస్.ఆర్థిక 4761, హెచ్.భరత్ 6430, శరత్ చంద్ర 8388, అమృత వర్షిణి  9461, ఎ.అత్రీజ్ 9955, జే.తన్విక 10292 ర్యాంకులు సాధించగా కాకతీయ ఐఐటి/మెడికల్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ రామోజీ రావు (ఐఐటియన్) వారిని సన్మానించారు.

 

Kakatiya secures All India ranks in first attempt in JEE Mains results

 

ఈ సంధర్బంగా రామోజిరావు మాట్లాడుతూ.. కాకతీయ విద్యాసంస్థకు వేరే జిల్లాలో, ఇతర బ్రాంచీలలో సాధించిన ఆలీండియా ర్యాంక్స్ కాదని కేవలం నిజామాబాద్ కాకతీయలో సాధించిన ర్యాంకులు అని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. 10 మంది విద్యార్ధులు జేఈఈ మెయిన్స్ లో ఆలిండియా స్థాయి ర్యాంకులు సాధిస్తే 50 మంది విద్యార్ధులు ఐఐటి అడ్వాన్స్డ్ కు అర్హత సాధించారన్నారు. తమ విద్యార్ధులు జిల్లా స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి కాకతీయ విద్యాసంస్థల పేరు నిలబెట్టారని అన్నారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ తెజస్వీని, సిహెచ్ రాజా, ఐఐటి అకాడమీ డీన్ నాగరాజు, ప్రిన్సిపాల్ సందిప్ కులకర్ణీ, రణదిష్, వైస్ ప్రిన్సిపాల్ శ్యాం, జ్యోత్స్న తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

 

Kakatiya secures All India ranks in first attempt in JEE Mains results

More articles

Latest article