నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ తెలిపారు. మంగళవారం జరిగిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 813 విద్యార్థులకు గాను 790 మంది విద్యార్థులు హాజరయ్యారని, 23 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. అలాగే 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 107 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. హాజరైన వారిలో ఒక విద్యార్థి మాస్ కాపీయింగ్ కి పాల్పడడంతో అతనిని డిబార్ చేసినట్టు పేర్కొన్నారు. పరీక్షలన్ని నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.

